తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ‘బస్ కా పయ్యా నహి ఛలేగా’ అనే నినాదంతో సమ్మెకు వెళ్తున్నాం. ప్రభుత్వం హామీ ఇచ్చి రెండున్నర ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఎలాంటి న్యా యం చేయలేదు. అన్ని డిపోలలో అధికారుల వేధింపులు, అధిక పనిభారం, అధిక కిలోమీటర్లతో ఇబ్బందులు పెడుతున్నారు.
– జేఎస్‌ఎన్.రావు, జేఏసీ వైస్‌చైర్మన్
పనిభారం తగ్గించాలి
ఆర్టీసీ డిపోల్లో ఉద్యోగులకు పనిభారం ఎక్కువైంది. కార్మికుల పని గంటలు పెంచుతుండ్రు. యూనియన్లు లేవని ఇబ్బందులు పెడుతుండ్రు. వేధింపులు తట్టుకోలేకనే సమ్మెకు వెళ్లాల్సి వచ్చింది. రెండు పీఆర్సీలు ఇవ్వడం లేదు. బతుకుపోరాటంగా పరిగణించి హక్కులు సాధించుకుంటాం.
– శ్రీనివాస్‌నాయక్, వైస్‌చైర్మన్


