ఆలయ భూములు ఇలా.. (ఎకరాల్లో) | - | Sakshi
Sakshi News home page

ఆలయ భూములు ఇలా.. (ఎకరాల్లో)

Feb 26 2026 7:22 AM | Updated on Feb 26 2026 7:22 AM

ఆలయ భూములు ఇలా.. (ఎకరాల్లో)

ఆలయ భూములు ఇలా.. (ఎకరాల్లో)

ఆలయ భూములు ఇలా.. (ఎకరాల్లో)

జిల్లాలో 441.22 ఎకరాల ఆలయ భూములు పాస్‌ బుక్కులున్నవి 63.11 ఎకరాలు పాస్‌ బుక్కులు ఇవ్వాల్సినవి 378.11 ఎకరాలు విలువైన భూములు పరాధీనం ఫోరెన్సిక్‌ ఆడిట్‌తో అక్రమాలు వెలుగు చూసేనా?

మండలం ఆలయ పాస్‌ బుక్‌ పాస్‌ బుక్‌

భూములు జారీ అయినవి జారీ కానివి

సిరిసిల్ల 13.30 – 13.30

తంగళ్లపల్లి 64.14 8.10 56.04

ముస్తాబాద్‌ 88.05 21.02 67.03

గంభీరావుపేట 79.36 – 79.36

ఇల్లంతకుంట 22.10 2.39 19.11

వేములవాడ 32.26 4.39 27.27

చందుర్తి 28.10 – 28.10

కోనరావుపేట 5.23 1.08 4.15

ఎల్లారెడ్డిపేట 72.35 5.34 67.01

బోయినపల్లి 33.33 19.21 14.12

ఆలయ భూముల వివరాలు

సిరిసిల్ల: జిల్లాలో దేవుని మాన్యాలు(ఆలయ భూములు) అన్యాక్రాంతమవుతున్నాయి. పట్టించుకునే వారు లేక పరాధీనమవుతున్నాయి. అధికా రుల నిర్లక్ష్యం.. కొందరి స్వార్థంతో కబ్జాకు గురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ధరణి రికార్డులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తుండడంతో ఆలయ భూములకు రక్షణ లభిస్తుందనే ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని దేవుని మాన్యాల ఆక్రమణలపై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం.

జిల్లాలో కొన్నింటిని దేవాదాయ శాఖ 6–బీ స్థాయి ఆలయాలుగా గుర్తించి ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీస్‌ ఆధీనంలో పర్యవేక్షిస్తుంది. 6–బీ స్థాయి ఆలయాలు జిల్లాలో 21 ఉన్నాయి. దేవాదాయశాఖ పరిధిలోకి రాని ఆలయాలు మరో 50 వరకు ఉన్నాయి. కానీ ఈ ఆలయాలకు రూ.కోట్ల విలువైన భూములు ఏన్నాయి. దేవుడికి దీపధూప నైవేద్యాలు సమర్పించే పూజారుల పేరుతో పూర్వపు దేశాయిలు, దేశ్‌ముఖ్‌లు, ఆలయ నిర్మాణ దాతలు భూములను అప్పగించారు. ఆ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తూ దేవుడికి నిత్యపూజలు చేయాలని నిర్ణయించారు. పూజారుల పేరిట భూములు ఉండడంతో రెవెన్యూ రికార్డుల్లోనూ అయ్యవార్ల పేర్లు వచ్చాయి. వాస్తవానికి ఆ భూములు ఆలయానివే అయినా రికార్డుల్లో పూజారుల పేర్లు ఉండడంతో వారి వారసులు అమ్మేశారు. దీంతో జిల్లాలోని దేవాలయ భూములు పరాధీనమయ్యాయి. చౌకధరలకే అమ్మేసి సొమ్ము చేసుకున్నారు.

భూభారతితో రక్షణ లభించేనా..

భూభారతిలో భాగంగా రెవెన్యూ భూరికార్డుల ఫోరిన్సిక్‌ ఆడిట్‌ చేస్తున్నారు. గతంలో పాస్‌పుస్తకాలు, పహణీల ఆధారంగా ధరణిలో నమోదైన భూముల వివరాలు ఆడిట్‌ చేస్తున్నారు. జిల్లాలోని ఆలయ భూములకు రక్షణ లభిస్తుందనే ఆశలు చిగురించాయి. ఇప్పటికే అన్యాక్రాంతమైన భూములపై ఎండోమెంట్‌ కోర్టులో కేసులు విచారణలో ఉండగా.. ప్రస్తుతానికి వివాదరహితంగా ఉన్న భూములకు సంబంధించిన రికార్డులను ఆడిట్‌ చేస్తున్నారు. గతంలో ఆలయం పేరుతోనే భూమిహక్కుల పత్రాలు పాస్‌బుక్కులను జారీ చేశారు. పహణీ, వన్‌–బీ రికార్డుల్లోనూ దేవుడి పేరును రాస్తూ క్రమబద్ధీకరించారు. స్థానిక విచారణతో ఆలయ భూములుగా గుర్తించిన వాటిని భూభారతిలో నమోదు చేస్తున్నారు. జిల్లాలోని ఆలయ భూములు మళ్లీ పరాధీనం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆలయాలు : 71

ఆలయాల భూములు:

441.22 ఎకరాలు

పాస్‌బుక్కులు పొందినవి:

63.11 ఎకరాలు

పాస్‌బుక్కులు పొందాల్సినవి: 378.11 ఎకరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement