ప్రతిభ వెలికితీసేందుకే టాలెంట్ టెస్ట్
సిరిసిల్లటౌన్: విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే టాలెంట్ టెస్టు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో పదో తరగతి విద్యార్థులకు బుధవారం టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ టాలెంట్ టెస్ట్‌కు హాజరయ్యారు. విద్యార్థి నాయకులు శ్రీరాముల సంజన, జాలపల్లి మనోజ్‌కుమార్, శివ, మహేశ్, నవీన్, రాకేశ్, సాయిరామ్ పాల్గొన్నారు.


