‘సాక్షి’కి రుణపడి ఉంటాం | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’కి రుణపడి ఉంటాం

Feb 26 2026 7:22 AM | Updated on Feb 26 2026 7:22 AM

‘సాక్

‘సాక్షి’కి రుణపడి ఉంటాం

‘సాక్షి’కి రుణపడి ఉంటాం ● కాసర్ల జలంధర్‌రెడ్డి సమస్యలు పరిష్కరించండి

● కాసర్ల జలంధర్‌రెడ్డి

వేములవాడరూరల్‌: రాజన్న మెట్లపై ఉంటున్న తమను గుర్తించి తమ కష్టాలను ప్రజలకు తెలిసేలా చేసిన ‘సాక్షి’ దినపత్రికకు రుణపడి ఉంటామని కాసర్ల జలంధర్‌రెడ్డి కన్నీటిపర్యంతమయ్యాడు. ‘విద్యావంతులు.. ఈ బిచ్చగాళ్లు’ కథనంతో ‘సాక్షి’ జలంధర్‌రెడ్డి దంపతుల దీనగాథను బుధవారం వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనం తనకెంతో ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నాడు. కష్టాల్లో ఉన్న తమ గాథను కళ్లకు కట్టినట్లు చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటే సాఫీగా జీవిస్తామని పేర్కొంటున్నారు.

సిరిసిల్లటౌన్‌: మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని సీఐ టీయూ జిల్లా కార్యదర్శి మూశం రమేశ్‌ కోరా రు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ము న్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతా మని హెచ్చరించారు. ఈమేరకు మున్సిపల్‌ క మిషనర్‌ ఖదీర్‌పాషాకు వినతిపత్రం అందజేశారు. వారం రోజుల్లోగా సమస్యలు పరిష్కరిస్తానని కమిషనర్‌ హామీతో ధర్నా విరమించారు. కోడం రమణ, కాసారపు శంకర్‌, ఏల్పుల బాలయ్య, రాజయ్య, బాబాకిషన్‌, మమత, లక్ష్మి, యశోద, నరేశ్‌ పాల్గొన్నారు.

ఒత్తిడికి గురికావద్దు

వేములవాడఅర్బన్‌: పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలోని వసతిగృహంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజన్య ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పరీక్ష విధానం, పరీక్ష హాలులో ఒత్తిడికి గురికాకుండా ఎలా ఉండోలా సూచించారు.

కాలువ పనుల కోసం రైతుల భిక్షాటన

ఇల్లంతకుంట(మానకొండూర్‌): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 11/6 అసంపూర్తి కాలువ పనులు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు బుధవారం ఇల్లంతకుంటలో భిక్షాటన చేపట్టారు. అసంపూర్తి కాలువ పనులు పూర్తి చేయాలని గత 16 రోజులుగా పెద్దలింగాపూర్‌, రామన్నపల్లి, రామాజీపేట, చిక్కుడువానిపల్లి, బాలు మల్లుపల్లి గ్రామాల రైతులు భిక్షాటనలో పాల్గొన్నారు. గతేడాది దీక్ష చేపట్టగా నిధులు మంజూరు చేసినట్లు అధికారులు చెప్పడంతో దీక్ష విరమించినట్లు రైతులు తెలిపారు. పనులు చేయకపోవడంతో ఈనెల 10 నుంచి ఆయా గ్రామాల రైతులు పెద్దలింగాపూర్‌ వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పదహారు రోజులుగా దీక్ష చేస్తున్నా పాలకులు స్పందించకపోవడంతో భిక్షాటన చేపట్టినట్లు తెలిపారు. భిక్షాటనలో దాదాపు 200 మంది రైతులు పాల్గొన్నారు.

పెండింగ్‌ కాలువ పనులు పూర్తి చేయాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకేజీలు 11/6, 11/5, 11/4 కాలువ పనులను తక్షణమే పూర్తి చేసి, సాగునీరు విడుదల చేయాలని కోరుతూ చేపట్టిన రైతుల రిలే నిరాహార దీక్షకు బస్వాపూర్‌ సర్పంచ్‌ పూర్మాని రాజశేఖర్‌రెడ్డి మద్దతు తెలిపారు. గ్రామస్తులతో కలిసి వెళ్లి తన మద్దతు ప్రకటించారు. రైతుల కన్నీళ్లను ప్రభుత్వ తుడవాలని కోరారు. బస్వాపూర్‌ రైతులు కర్నె బాలయ్య, మోతె మహేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘సాక్షి’కి రుణపడి ఉంటాం
1
1/2

‘సాక్షి’కి రుణపడి ఉంటాం

‘సాక్షి’కి రుణపడి ఉంటాం
2
2/2

‘సాక్షి’కి రుణపడి ఉంటాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement