డ్రగ్స్‌తో నష్టాలపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌తో నష్టాలపై అవగాహన కల్పించాలి

Feb 26 2026 7:22 AM | Updated on Feb 26 2026 7:22 AM

డ్రగ్స్‌తో నష్టాలపై అవగాహన కల్పించాలి

డ్రగ్స్‌తో నష్టాలపై అవగాహన కల్పించాలి

● అదనపు కలెక్టర్‌ నగేశ్‌

● అదనపు కలెక్టర్‌ నగేశ్‌

సిరిసిల్లటౌన్‌: డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌ నియంత్రణకు చేపట్టిన చర్యలపై బుధవారం అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్‌ కంట్రోల్‌ సమావేశం నిర్వహించారు. డ్రగ్స్‌ వినియోగంతో కలిగే నష్టాలపై ప్రచారంపై చర్చించారు. మత్తుపదార్థాలకు బానిసైన వారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌ బేగం, ఎకై ్సజ్‌ అధికారి శ్రీనివాసరావు, కార్మిక శాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనూష పాల్గొన్నారు.

రోడ్డు భద్రత చర్యలు అమలు చేయాలి

రోడ్డు భద్రత చర్యలు అమలు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ ఆదేశించారు. రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవేస్‌, పీఆర్‌, పోలీస్‌, ట్రాన్స్‌పోర్ట్‌, వైద్యం, ఎకై ్సజ్‌, విద్య, ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. ప్రధాన రహదారుల్లో గుర్తించిన బ్లాక్‌స్పాట్స్‌ వద్ద రంబుల్‌ స్ట్రిప్స్‌, సోలార్‌ సిగ్నల్స్‌, సైన్‌బోర్డ్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు పైకి అడ్డుగా వచ్చిన చెట్ల కొమ్మలను తొలగించాలన్నారు. పెట్రోల్‌బంక్‌లలో నో హెల్మెట్‌ .. నో పెట్రోల్‌ అమలు చేయాలని సూచించారు. ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్‌, డీటీవో లక్ష్మణ్‌, ఈఈలు నరసింహాచారి, సురేశ్‌రాథోడ్‌, సుదర్శన్‌రెడ్డి, డీఈలు అన్నయ్య, శాంతయ్య, డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, ఎకై ్సజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు, కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

‘పది’ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

జిల్లాలో నిర్వహించే పదోతరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 15 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 7,317 మంది విద్యార్థులకు 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష సమయానికి అనుకూలంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. ఏఎస్పీ చంద్రయ్య, డీటీవో నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement