సాయం అందించి ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

సాయం అందించి ఆదుకోండి

Feb 26 2026 7:22 AM | Updated on Feb 26 2026 7:22 AM

సాయం అందించి ఆదుకోండి

సాయం అందించి ఆదుకోండి

● లివర్‌ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన అర్చకుడు ● దాతలు ఆదుకోవాలని గ్రామస్తుల విన్నపం

● లివర్‌ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన అర్చకుడు ● దాతలు ఆదుకోవాలని గ్రామస్తుల విన్నపం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆలయంలో పూజలు చేసే అర్చకుడు లివర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. కడు పేదరికం కావడంతో వైద్యచికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించాలని ఆ గ్రామస్తులు వేడుకుంటున్నారు. మండలంలోని నారాయణపూర్‌ శివాలయంలోని అర్చకుడు నారాయణ లివర్‌ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆరోగ్యం విషమించడంతో మంగళవారం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా లివర్‌ సంబంధిత వ్యాధిగా వైద్యులు నిర్ధారించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అర్చకుని పరిస్థితి విషమంగా ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఖరీదైన వైద్యం అందే పరిస్థితి లేకుండా పోయింది. ఆర్థిక స్థోమత లేని అర్చకుడికి సాయం అందించాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. సాయం చేయాల్సిన వారు 99121 87103లో సంప్రదించాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement