గోల్డెన్‌ అవర్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ అవర్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి

Jan 13 2026 5:43 AM | Updated on Jan 13 2026 5:43 AM

గోల్డ

గోల్డెన్‌ అవర్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి

గోల్డెన్‌ అవర్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి ● 108 జిల్లా మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ కార్మికులను విస్మరిస్తున్న ప్రభుత్వాలు నిజాయితీపరులను గెలిపించండి జిల్లా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి భీమన్నకు మరింత భద్రత

● 108 జిల్లా మేనేజర్‌ అరుణ్‌కుమార్‌

సిరిసిల్లటౌన్‌: అత్యవసర సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకునేలా అంబులెన్స్‌ సిబ్బంది ఎళ్లవేలలా అందుబాటులో ఉండాలని 108 జిల్లా మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ సూచించారు. జిల్లాలోని 108 అత్యవసర అంబులెన్స్‌ వాహనాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో తనిఖీ చేసి మాట్లాడారు. గోల్డెన్‌ అవర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. 108 సిబ్బంది పెద్ది శ్రీనివాస్‌, జలగం సత్యసాగర్‌, పోచంపల్లి పరశురాములు, నునావత్‌ మదన్‌, మొగిలి సుధాకర్‌, పొలబోయిన గణేష్‌ పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని బిల్డింగ్‌, అదర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ యూ నియన్‌ జిల్లా కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి ఆరోపించారు. సిరిసిల్లలోని అమృత్‌లాల్‌ శుక్లా కార్మిక భవన్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి.. నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు. నాయకులు కోల శ్రీనివాస్‌, లింగంపల్లి శ్రీనివాస్‌, నర్సవ్వ, మంజుల, సుధాకర్‌ పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: ప్రజాసమస్యలపై నిజాయితీగా పోరాడే నాయకులనే ప్రజలు మున్సిపల్‌ ఎన్ని కల్లో గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్‌ కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడా రు. ప్రస్తుత రాజకీయాలు వ్యాపారంగా మారి పోయాయన్నారు. డబ్బులు వెచ్చించి గెలిచి మళ్లీ సంపాదించుకోవాలన్నా ఆకాంక్షనే తప్ప ప్రజలకు సేవ చేయాలని ఎవరికీ లేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, సీనియర్‌ నాయకులు రాపల్లి రమేశ్‌, కోల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: జిల్లా కోసం ఉద్యమించిన నాయకులపై జిల్లా ఏర్పడ్డ తర్వాత కూడా కేసులు కొనసాగించడం సరికాదని ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర నాయకుడు సోమిశెట్టి దశరథం పేర్కొన్నారు. జిల్లా ఉద్యమ నేపథ్యంలో పెట్టిన కేసులో సోమవారం కరీంనగర్‌ కోర్టుకు హాజరై మీడియాతో మాట్లాడారు. స్థానిక ప్రజల ఆకాంక్ష కోసం ఉద్యమిస్తే అప్పటి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందన్నారు. జైలుకు పంపినా భయపడకుండా పోరాడడంతో జిల్లా ఏర్పడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు జిల్లా రద్దుపై వస్తున్న వదంతులపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమకారులు వెంకటేశం, కంసాని మల్లేశం పాల్గొన్నారు.

జిల్లా భూసర్వే అధికారిగా శ్రీనివాస్‌

సిరిసిల్ల: జిల్లా భూసర్వే అధికారిగా పి.శ్రీనివాస్‌ ని యమితులయ్యారు. గతంలో జిల్లా భూసర్వే ఇన్‌చార్జి అధికారిగా పనిచేసిన శ్రీని వాస్‌ను మంచిర్యాల జిల్లా భూసర్వే అధికారిగా కొనసాగిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో డీఐగా పనిచేస్తున్న పి.శ్రీనివాస్‌ను పదోన్నతిపై జిల్లాకు కేటాయించారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ జిల్లా భూసర్వే అధికారిగా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించారు.

వేములవాడ: భక్తులకు భద్రత కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుంది. సోమవారం భీమన్న, బద్దిపోచమ్మ ఆలయాల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హుండీలు నిండిపోవడంతో వాటికి తాళాలు వేసి సీల్‌ చేసి పెట్టారు. దీంతో ప్రత్యేక పోలీసులచే భద్రత ఏర్పాట్లు చేశారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ నిర్వహించారు.

గోల్డెన్‌ అవర్‌లో   జాగ్రత్తలు తీసుకోవాలి
1
1/1

గోల్డెన్‌ అవర్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement