ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా నిర్వహించాలి
సిరిసిల్ల క్రైం: బాల కార్మికులను నిర్మూలించేందుకు కొనసాగుతున్న ఆపరేషన్ స్మైల్‌ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గడిచిన 13రోజుల్లో 28మంది పిల్లలను పట్టుకొని మూడు కేసులు నమో దు చేసినట్లు తెలిపారు. పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాంలు, మె కానిక్‌షాప్‌లు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, సీడబ్ల్యూసీ చైర్మన్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిపించాలి
సిరిసిల్లటౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.రజిత అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశ, నోడల్ సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్ర భుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు ప్రో త్సహించాలని, ప్రమాదకర గర్భిణిని గుర్తించడం, వారికి సకాలంలో రక్తహీనత లేకుండా, రక్తపోటు నివారణ చికిత్స అందించాలని సూ చించారు. ఆరోగ్యపై అవగాహన కల్పిస్తూ.. లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా అధికారి (డీటీవో) లక్ష్మణ్ అన్నారు. జాతీయ రహదారి భద్ర త మాసోత్సవాల సందర్భంగా మంగళవారం తంగళ్లపల్లిలోని తాడూరు చౌరస్తాలో డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని, దీనిని ప్రతిఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని తెలిపారు. అనంతరం ఐటీడీఆర్ మండెపల్లిలో డ్రైవర్లతో సమావేశం నిర్వహించి అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. వా హనదారులు, డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్టీఏ సభ్యులు సంగీతం శ్రీనాథ్, ఏఎంవీఐ రజినీదేవి, ట్రాక్టర్, ఆటో డ్రైవర్లు, యజమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాను ఎత్తివేస్తే కాంగ్రెస్ భూస్థాపితమే
సిరిసిల్లటౌన్: దశాబ్దం క్రితం బీఆర్‌ఎస్ సర్కారుపై పోరాడి సాధించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమని జిల్లా ఉద్యమకారుల జేఏసీ హెచ్చరించింది. మంగళవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొద్ది రోజులుగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై వస్తున్న ప్రకటనల నేపథ్యంలో గతంలో పోరాడిన జిల్లా ఉద్యమకారులు మరోసారి ఉద్యమించి జిల్లాను రక్షించుకుంటామన్నారు. ఈవిషయంలో ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని సూచించారు. జేఏసీ నాయకులు చొక్కాల రాము, కంసాల మల్లేశం. సోమిశెట్టి దశరథం. వీరబోయిని మల్లేశ్‌యాదవ్. ఎండీ సలీం. రంజిత్, లింగంపల్లి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
జాబితాకు సహకరించాలి
సిరిసిల్లటౌన్: పోలింగ్‌స్టేషన్ల జాబితా తయారీకి అన్ని పార్టీలు సహకరించాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖాదీర్‌పాషా అ న్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ ంలో పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ముసాయిదా జాబితాను విడుదల చేశారు. అంతకు ముందు వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ముసాయిదా జాబితాపై వా రి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా నిర్వహించాలి
ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా నిర్వహించాలి
ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా నిర్వహించాలి


