నేడు భోగి
కొత్త ఏడాదిలో కొంగొత్తగా సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధం అవుతున్నారు. నేడు భోగి.. 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలకు ఏర్పాట్లు చేశారు. భోగి భోగ భాగ్యాలను.. సంక్రాంతి జీవితంలో కొత్తక్రాంతి ఇస్తుందని.. కనుమ రోజు బొమ్మల కొలువు అనురాగాలకు వేదికగా ఉంటుందని ప్రతీతి.. నేటి వేకువజామున భోగి మంటలు వేస్తారు. ముంగిళ్లలో మహిళలు అందమైన రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు, వాటిమధ్య పూలు, నవధాన్యాలు పోస్తారు. డూడూ బసవన్న విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలతో సంక్రాంతి వేడుకలు ప్రారంభం అవుతాయి.
– సిరిసిల్ల కల్చరల్


