విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్: విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలం అగ్రహారంలోని జేఎన్టీయూ కళాశాలను సోమవారం సందర్శించా రు. తరగతి గదులు, క్యాంటీన్, వంటగదులు, ల్యాబ్‌ను పరిశీలించారు. మోనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. గతంలో విద్యార్థులు ఇబ్బందిపడితే వెంటనే సమస్యను పరిష్కరించామన్నారు. గతంలో డిగ్రీ కళాశాల సందర్శించినప్పుడు బాలికల హాస్టల్‌ను రూ.10కోట్లతో మంజూరు చేశామన్నారు. హాస్టల్ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం కళాశాలలో వసతులు కల్పించలేదన్నారు. త్వరలోనే కాలేజీకి శాశ్వత భవనం ముంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఫైనలియర్ విద్యార్థులకు అకాడమీ ద్వారా ఉచిత కోచింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జేఎన్టీయూహెచ్ వైస్‌చాన్స్‌లర్ కిషన్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ వేణుగోపాల్ ఉన్నారు.


