
పాపన్నగౌడ్ మార్గం ఆచరణీయం
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: నిరంకుశ పాలనపై దండయాత్ర చేసి బీసీల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మార్గం ఆచరణీయమని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన పాపన్నగౌడ్ జయంతికి హాజరై మా ట్లాడారు. కులమతాలకతీతంగా అందరినీ ఏకం చేసి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరా టం చేశారన్నారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చి దుర గోవర్ధన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి బుర్ర నారా యణగౌడ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ కౌన్సిలర్ బొల్గం నాగరాజుగౌడ్ పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో నివాళి..
కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి బీసీ సంక్షేమాధికారి, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాందాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, గౌడ సంఘం ప్రతినిధులు గోవర్ధన్‌గౌడ్, బుర్ర నారాయణగౌడ్, పులి లక్ష్మీపతిగౌడ్, బొల్గం నాగరాజుగౌడ్, అమరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పాపన్నగౌడ్ మార్గం ఆచరణీయం