టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి చేరిక | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి చేరిక

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

గిద్దలూరు రూరల్‌: అధికారపార్టీపై వ్యతిరేకతే మన గెలుపు అవుతుందని వైఎస్సార్‌ సీపీ గిద్దలూరు ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపం వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం మున్సిపాలిటీలోని 8వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు పల్లె పుల్లారెడ్డి, బోగాని హరికృష్ణ, పలుకూరి శివకుమార్‌లతో పాటు మరికొంత మంది కేపీ నాగార్జునరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలల్లో పూర్తి వ్యతిరేకత ఉందని, అదే మనల్ని గెలిపిస్తుందన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసే బాధ్యత ప్రతి కార్యకర్త, నాయకుడు భుజాలపై వేసుకోవాలన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు అంకిత భావంతో పనిచేయాలని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ప్రజల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై చెరగని అభిమానం ఉందన్నారు. ప్రతి కార్యకర్త నాయకుడు కలిసికట్టుగా పని చేయాల్సిన సమయం దగ్గరపడిందన్నారు. పార్టీకి కార్యకర్తలే నిజమైన బలమన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయించిన రిజర్వేషన్ల దృష్ట్యా పోటీల్లో ఆయా రిజర్వేషన్లకు సంబంధించిన నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఒక ప్రణాళికబద్ధంగా తగిన వ్యూహాలు రచించుకోవాలన్నారు. కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ఎప్పటికీ విస్మరించమన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడి వారి తరఫున పోరాడేందుకు పార్టీ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. జగనన్న పాలనలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. జగనన్నను తిరిగి మనం ముఖ్యమంత్రిగా చూసేందుకు సైనికులవలే పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తల అభిష్టం మేరకు ప్రభుత్వం కొనసాగుతూ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు గ్రామాలు, వార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించాలని కేపీ నాగార్జునరెడ్డి సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, చేరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, మానం బాలిరెడ్డి, డాక్టర్‌ సూరేపల్లె రామకృష్ణ, కాజ, పోలేపల్లె శివ, మత్తయ్య, యర్రమూరి భాస్కర్‌, కన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement