నామినేషన్లలో అప్రమత్తంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లలో అప్రమత్తంగా వ్యవహరించాలి

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

పురపాలక ఎన్నికల్లో బాధ్యతతో విధులు నిర్వర్తించాలి ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలకు మొదటి దశ శిక్షణ శిక్షణలో కలెక్టర్‌, ఎన్నికల అధికారి పి.రాజాబాబు

ఒంగోలు సబర్బన్‌: పురపాలక ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజాబాబు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియపై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓ లకు మొదటి దశ శిక్షణ కార్యక్రమం గురువారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని కలెక్టర్‌ చెప్పారు. ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నామినేషన్‌ ప్రక్రియలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు విధులు, నిర్వహించాల్సిన విధివిధానాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలన్నారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు మున్సిపాలిటీలలో పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల్లోగా నామినేషన్ల స్వీకరణ చేపట్టాలన్నారు. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలన్నారు. 21వ తేదీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాలన్నారు. తప్పులు, పొరపాట్లు చేయకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళిపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని, తప్పులు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసే వరకు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. ఆర్‌ఓ కార్యాలయాల వివరాలు ముందుగానే సంబంధిత వార్డుల్లోని ప్రజలకు ప్రకటించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో లా అండ్‌ ఆర్డర్‌ అమలు కోసం పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈఆర్‌ఓల వద్ద ఓటర్ల జాబితా ఉండాలని, విధుల నిర్వహణపై చెక్‌ లిస్ట్‌ పరిశీలించుకోవాలని సూచించారు. బీసీ కార్పొరేషన్‌ ఈడీ, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా ఇన్చార్జి అధికారి ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియపై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నామినేషన్‌ ప్రక్రియ ముందు, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ, అభ్యర్థుల అర్హత వంటి పలు అంశాలపై క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్‌ వెంకటకృష్ణయ్య, ఆర్డీఓ టి.చంద్రశేఖర్‌, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement