గుండ్లకమ్మ నదికి నీళ్లొదిలారు.. | - | Sakshi
Sakshi News home page

గుండ్లకమ్మ నదికి నీళ్లొదిలారు..

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నుంచి నీళ్లు వదలకపోవడంతో ప్రజల ఇక్కట్లు రిజర్వాయర్‌ను పరిశీలించి అధికారులతో మాట్లాడిన మాజీ మంత్రి మేరుగు ఎట్టకేలకు నదిలోకి నీరు విడుదల

మద్దిపాడు: గుండ్లకమ్మ నదిపై మల్లవరం వద్ద ఉన్న రిజర్వాయర్‌ నుంచి నదిలోకి పూర్తిగా నీరు వదలడం నిలిపేశారు. ఈ క్రమంలో గుండ్లకమ్మ నీటి కోసం ఆధారపడి ఉన్న మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తమకు రిజర్వాయర్‌ నుంచి నదిలోకి నీరు విడుదల చేయించాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జునను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం మల్లవరం వద్ద ఉన్న రిజర్వాయర్‌ను పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. మార్గమధ్యంలోనే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన గుండ్లకమ్మ రిజర్వాయర్‌ వద్దకు వచ్చి రిజర్వాయర్లో నీటిమట్టం పరిశీలించారు. గత ప్రభుత్వంలో 19 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్లో నీరు నిలిచినప్పుడు కూడా గుండ్లకమ్మ నదిలోకి నీరు విడుదల చేశారన్నారు. దీంతో నదిపై ఆధారపడి ఉన్న దిగువ గ్రామాల ప్రజలు, పశువులకు నీరు, మేత పెట్టుకునేందుకు సరిపోయాయని, కానీ ప్రస్తుతం ఆ విధంగా నీటిని విడుదల చేయకుండా నిలుపుదల చేయడం మంచి పద్ధతి కాదని ఆయన అధికారులకు తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ పనైనా తాను సహించబోనని స్పష్టం చేశారు. దీంతో రిజర్వాయర్‌ జేఈ రామాంజనేయులు ఉన్నతాధికారులకు విషయం తెలిపి వెంటనే ఏడో నంబర్‌ గేటు ఎత్తి 250 క్యూసెక్కుల నీటిని గుండ్లకమ్మ నదిలోకి విడుదల చేశారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ నాయకులు వాకా కోటిరెడ్డి, పోలవరపు శ్రీమన్నారాయణ, పోలిలేని కోటేశ్వరరావు, పాలడుగు రాజీవ్‌, బొమ్మల రామాంజనేయులు, అన్వేష్‌, గుడ్డపాతల రవి, కాకర్ల వెంకటేష్‌, దుడ్డు వినోద్‌కుమార్‌, కందుల డానియేలు, నాదెండ్ల మహేష్‌, మద్దినేని శ్రీకాంత్‌, రావూరి ప్రసన్నకుమార్‌రెడ్డి, జగన్నాథ్‌ కోటిలింగం, వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, పోకూరి శ్రీరాములు, రావూరి అశోక్‌రెడ్డి, ఎడవల్లి మోహన్‌రావు, పైనం ప్రసాదరావు, రాయపాటి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement