పులుల రక్షణ ఛత్రంగా నల్లమల అభయారణ్యం
పులి గాండ్రిస్తే అడవి దద్దరిల్లుతుంది! జీవవైవిధ్యాన్ని
రక్షించడంలో, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో
అడవికి రారాజు అయిన పెద్దపులి పాత్ర అత్యంత కీలకమైనది. దేశంలోనే అతిపెద్దదైన నల్లమలలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఈ చారల అందాల స్వేచ్ఛా విహారానికి సురక్షిత నిలయంగా మారింది. దట్టమైన నల్లమల అరణ్యంలో పులులు రాజసంగా అడుగులేస్తూ తమ సంతతిని
గణనీయంగా వృద్ధి చేసుకుంటున్నాయి. ఒకవైపు
అక్రమార్కులు, వేటగాళ్ల ముప్పు పొంచి ఉన్నా.. అటవీశాఖ ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులు, రెస్క్యూ టీమ్‌లు, డాగ్
స్క్వాడ్‌ల వంటి కట్టుదిట్టమైన పరిరక్షణ చర్యల వల్ల
నల్లమలలో బెబ్బులి రొమ్ము విరిచి తిరుగుతోంది. 2022 గణాంకాల ప్రకారం నల్లమలలో 63 పెద్దపులులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 87కు చేరి ఉంటుందని అటవీ శాఖ
అధికారుల అంచనా. పచ్చని అడవికి ప్రాణమైన మన జాతీయ జంతువును కాపాడుకోవడం, భావితరాలకు అందించడం
ఎంతో అవసరం. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం
సందర్భంగా ప్రత్యేక కథనం..
– పెద్దదోర్నాల
నాగార్జున సాగర్–శ్రీశైలం
టైగర్ రిజర్వ్ ముఖచిత్రం
విస్తరించిన జిల్లాలు
నంద్యాల, మార్కాపురం, పల్నాడు.
పాత విస్తీర్ణం
3,727.82 చ.కి.మీ
అదనంగా కలిపిన విస్తీర్ణం
2,149 చదరపు కిలోమీటర్లు.
కొత్త హోదా : ఎకో సెన్సిటివ్ జోన్
పులుల ప్రధాన ఆహారం
జింకలు, దుప్పులు,
అడవి పందులు.


