మెడికల్‌ హబ్‌గా ఒంగోలు | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ హబ్‌గా ఒంగోలు

Jul 1 2026 12:34 AM | Updated on Jul 1 2026 12:34 AM

● పవర్‌ ఆఫీసు ఎదురు లైనులో ఉన్న ఎన్జీఓ కాలనీలోని అరవింద్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అరుదైన వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నారు. పీడియాట్రిక్‌ ఎండోస్కోపీ, పీడియాట్రిక్‌ బ్రాంకోస్కోపీ ద్వారా చిన్నారుల్లో ఏర్పడే సమస్యలకు తక్షణ పరిష్కారం చేస్తున్నారు. విషమ పరిస్థితిలో ఉన్న చిన్నారులకు అరవింద్‌ హాస్పిటల్‌లో నమ్మకమైన వైద్య సేవలు లభిస్తున్నాయి. జీర్ణకోశ, శ్వాసకోశ వ్యాధులకు అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణులు డాక్టర్‌ మందలపు నరేంద్ర, పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్‌ భానుతేజ వైద్య సేవలందిస్తున్నారు. ● చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు జిల్లా ప్రజలు ఎక్కువగా ఒంగోలు నగరంలోని 60 అడుగుల రోడ్డులో ఉన్న శ్రీనివాస ఈఎన్‌టీ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. చెవిలో నొప్పి, ఇన్‌ఫెక్షన్లు, సైనసైటిస్‌, ముక్కులు మూసుకొని పోవడం, ముక్కు నుంచి రక్తం కారడం, గొంతు నొప్పి, స్వరం మార్పు తదితర సమస్యలతో పాటు కుటుంబసభ్యులను, ఇరుగుపొరుగు వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే గురకకు ఈఎన్‌టీ నిపుణులు డాక్టర్‌ నారపుశెట్టి శ్రీనివాసరావు చికిత్స అందిస్తున్నారు. ● నేటి ఆధునిక సమాజంలో బీపీ, సుగర్‌ వ్యాధులు ఎక్కువై పోయాయి. ఇలాంటి వారికి నాణ్యమైన చికిత్స అందిస్తున్నారు డాక్టర్‌ బి.అశోక్‌ కుమార్‌. సింగరాయకొండలోని డాక్టర్‌ శివరామిరెడ్డి నర్సింగ్‌ హోమ్‌లో అత్యవసర వైద్య సేవలు లభిస్తున్నాయి. పాము కాటు, తేలు కాటు, పాయిజన్‌ కేసులకు 24 గంటలూ వైద్యం అందుబాటులో వుంది. ● సత్యనారాయణపురంలోని శ్రీరామ్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో టైమ్స్‌ నౌ జాతీయ అవార్డు గ్రిహీత డాక్టర్‌ చాపల వంశీకష్ణ, డాక్టర్‌ చాపల శాంత కుమారి అన్నీ రకాల వ్యాధులకు ఒకే చోట వివిధ విభాగాల వైద్యులచే అత్యంత ఆధునిక వైద్య చికిత్సలు చేస్తున్నారు. ఎముకలు, కీళ్లు, ప్రసూతి విభాగం, నరాలు, యూరాలజీ, న్యూరో సర్జరీ, చిన్నపిల్లల వైద్యం, చెవి, ముక్కు,గొంతు, కంటి వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉంది. ప్రతి నెల మొదటి గురువారం పేదలకు ఉచిత వైద్య సేవలందిస్తున్నారు. ● సత్యనారాయణపురంలోని ఆద్విక చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ లో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ ఐ.రవితేజ నవజాత శిశువులకు ప్రత్యేక సంరక్షణ కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు టీకాలు వేస్తారు. ● సత్యనారాయణ పురంలోని మరో చిన్నపిల్లల వైధ్యశాల శ్రేష్ట హాస్పిటల్‌కు కూడా మంచిపేరుంది. ఇక్కడ 24 గంటలు ఎమర్జన్సీ సదుపాయం ఉందని డాక్టర్‌ డేవిడ్‌ విలియమ్స్‌ తెలిపారు. ● సుగర్‌ వ్యాధికి సురక్షిత వైద్యం అందిస్తున్నారు డాక్టర్‌ ఎ.గీత ప్రయదర్శిని. సుందరయ్య రోడ్డులోని గీతా డయాబెటిస్‌, ఎండోక్రైన్‌ సెంటర్లో సుగర్‌ వ్యాధులతో పాటుగా థైరాయిడ్‌ తదితర సమస్యలకు వైద్యం లభిస్తుంది. ● సుందరయ్య రోడ్డులోని గాయత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఎముకలు, కీళ్లు, నరాల నిపుణులు డాక్టర్‌ ఎన్‌బీ హర్షవర్థన్‌ రెడ్డి, నెమ్ము, ఊపిరితిత్తుల నిపుణులు డాక్టర్‌ వి. ప్రత్యూషరెడ్డిలు వైద్య సేవలందిస్తున్నారు. విరిగిన ఎముకలు, కీళ్ల మార్పిడి, మాకాళ్లు, నడుము నొప్పులతో పాటుగా నెమ్ము, ఆయాసం, టీబీ, ఆస్తమా, గురకలకు ప్రత్యేక చికిత్స లభిస్తుంది. ● చీమకుర్తి మాధవీ హాస్పిటల్‌లో ప్రసూతి నిపుణులు డాక్టర్‌ యన్‌.రాధాదేవి, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ బి.రమాలక్ష్మి, జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ నిపుణులు డాక్టర్‌ బి.రాహుల్‌ ఉన్నారు. సిజేరియన్‌ ఆపరేషన్ల అవసరం లేకుండానే కాన్పులు చేస్తున్నారు. కుట్టుకోత లేకుండా పైల్స్‌కు ఆపరేషన్లు చేస్తున్నారు. ● సంతాన సాఫల్య చికిత్సలో పేరొందిన జాయ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆధునిక చికిత్స అందుబాటులో ఉంది. ఇక్కడ ప్రసూతి నిపుణురాలు డాక్టర్‌ రాజమ్మ, కిడ్నీ వ్యాధుల నిపుణులు డాక్టర్‌ నోయల్‌ జాన్‌, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డాక్లర్‌ జిన్ని మాథ్యూ, జనరల్‌ మెడిసిన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, చిన్న పిల్లల వైద్య నిపుణులు ఉన్నారు. ● కన్సల్టెంట్‌ న్యూరో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ శరత్‌ మల్లిపెద్ది స్నేహా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలందిస్తున్నారు. పక్షవాత వైద్యానికి ఆధునిక వైద్యం అందించడంలో ప్రత్యేక వైద్య చికిత్స చేస్తున్నారు. మార్కాపురం, కందుకూరు, కనిగిరి ప్రాంతాల్లో వారంలో రెండు రోజులు వైద్య సేవలందిస్తున్నారు. ● నగరంలోని శ్రీమాధవీ హాస్పిటల్‌లో డాక్టర్‌ దుగ్గి బాల సుబ్రహ్మణ్యం పాముకాటు, తేలుకాటుకు, సుగర్‌, థైరాయిడ్‌, మలేరియా, విషజ్వరాలకు చికిత్స అందిస్తున్నారు.

అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య సేవలు

నగరంలో సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు

మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా

నాణ్యమైన వైద్యం అందుబాటులోకి

ఒంగోలు టౌన్‌: ‘ ఓ 18 నెలల బాబు పొరపాటున సీతాఫలం గింజ మింగేశాడు. అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస సక్రమంగా ఆడక చిన్నారి ఇబ్బంది పడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై ఒంగోలులో హాస్పిటల్‌కు తరలించారు. ఇక్కడకు వైద్యులు అత్యవసరంగా ఎండ్రోస్కోపీ చికిత్స ద్వారా సీతాఫలం గింజను బయటకు తీశారు. సకాలంలో చికిత్స అందడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు గుంటూరు, విజయవాడ, చైన్నెలకు తరలించేందుకు గంటల సమయం వృథా అయి ప్రాణాల మీదకు వచ్చేది. ఇలా అత్యవసర వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మెట్రో నగరాలకు ఏమాత్రం తగ్గకుండా ఒంగోలు నగరంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. మార్కాపురం జిల్లాలోని మారుమూల ప్రాంతమైన యర్రగొండపాలెం, పుల్లలచెరువు, దోర్నాల, గిద్దలూరు ప్రాంతాల్లో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే నరసరావుపేట, గుంటూరు తరలించేవారు. ఇప్పుడు ఒంగోలుకు తరలిస్తున్నారు.

● నగరంలోని సుందరయ్య రోడ్డులోని ఏషియన్‌ హాస్పిటల్స్‌లో న్యూరో, గ్యాస్ట్రో, లివర్‌ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు లభిస్తున్నాయి. మెదడు, వెన్నుముక శస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్‌ రాజశేఖర్‌ బొడ్డపాటి విజయవంతంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఇదే హాస్పిటల్‌లో గ్యాస్‌ ట్రబుల్‌, లివర్‌, గాల్‌ బ్లాడర్‌, ప్రాంకియాస్‌, రక్తపు వాంతులు, విరేచనాలకు గ్యాస్ట్రో, లివర్‌ వ్యాధుల నిపుణులు డాక్టర్‌ మానస వైద్యం అందిస్తున్నారు.

● నగరంలో 15 ఏళ్లుగా దంత వైద్య సేవలందిస్తున్న కేర్‌ దంత వైద్యశాలకు మంచి పేరుంది. లంబాడీడొంకలో వున్న ఈ వైద్యశాలలో డాక్టర్‌ కె.వేణుగోపాల్‌, డాక్టర్‌ సీహెచ్‌ హిమశిల్ప వైద్య సేవలందిస్తున్నారు. కట్టుడు పళ్లు, రూట్‌ కెనాల్‌, చిగుళ్ల వ్యాధులకు నాణ్యమైన చికిత్స లభిస్తుంది. ఇక్కడ ఈహెచ్‌ఎస్‌ సేవలు కూడా లభిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement