వేలం పాటల ఆదాయం రూ.13.77 లక్షలు | - | Sakshi
Sakshi News home page

వేలం పాటల ఆదాయం రూ.13.77 లక్షలు

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

వేలం పాటల ఆదాయం రూ.13.77 లక్షలు డ్వామా పీడీగా హనుమంతరావు నల్లమల సాగర్‌ నింపడమే లక్ష్యం

సింగరాయకొండ: పాత సింగరాయకొండ వరాహలక్ష్మీ నరశింహస్వామి దేవస్థానంలో మంగళవారం ఆలయానికి వేలం పాటల ద్వారా రూ.13.77 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన ఈఓ పీ కృష్ణవేణి తెలిపారు. జెయింట్‌ వీల్‌ ద్వారా రూ.12.25 లక్షలు, కొబ్బరికాయలు అమ్ముకొనేందుకు రూ.1.52 లక్షలు వేలం నిర్వహించినట్లు ఆమె వివరించారు. దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ సత్యన్నారాయణ, అర్చకులు ఉదయగిరి వెంకట లక్ష్మీనరశింహాచార్యులు, ఉదయగిరి లక్ష్మీనరశింహాచార్యులు, సిబ్బంది బ్రహ్మయ్య, దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మార్కాపురం: మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి డ్వామా పీడీగా హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్‌ విజయసునీతను కలిశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతరావు గతంలో మార్కా పురం ఎంపీడీఓగా విధులు నిర్వర్తించారు.

మంత్రి రామానాయుడు

పెద్దదోర్నాల: నల్లమల సాగర్‌ను నింపటమే లక్ష్యంగా వెలుగొండ ప్రాజెక్టు పనులు జరుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులతో పాటు, ఫీడర్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులను ఆయన పరిశీలించారు. వెలుగొండ ప్రాజెక్టులో హెడ్‌ రెగ్యులేటర్లు రిటైనింగ్‌ వాల్‌, వింగ్స్‌ రిటర్న్‌ పనులతో పాటు, టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజి పరిహారాన్ని అందిస్తామన్నారు. ఆయన వెంట కలెక్టర్‌ ఎం.విజయ సునీత, జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, సీఈ. రమేష్‌, ఎస్‌ఈ అబూతాలిం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement