● పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జేసీ కల్పనా కుమారి
ఒంగోలు సబర్బన్: నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 21వ తేదీ ఒంగోలు నగరంలో నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పరీక్ష కేంద్రాలను సందర్శించారు. అందుకుగాను చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష మొత్తం ఆరు కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయం, డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పీఎం జవహర్ నవోదయ విద్యాలయం, డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూల్, పీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ బాలుర హైస్కూల్లో జరగనున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


