ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

ఏపీయూఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ

మార్కాపురం:

ద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీయూఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేటు హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, ఐఆర్‌ 30 శాతం ఇవ్వాలని, 2003 డీఎస్‌సీ వాళ్లకి పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని, 2010 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దిలీప్‌, ఏపీయూఎస్‌ జిల్లా నాయకులు కే శంకర్రావు, రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్‌ కుమార్‌, కోశాధికారి బీవీ గుణప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగని శ్రీనివాసులు, కోశాధికారి రమణయ్య, జిల్లా సంఘటన కార్యదర్శి విశ్వేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేంద్రుడు, సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకృష్ణ, అల్లూరయ్య, రమణయ్య, బుర్రి శ్రీనివాసులు, అన్నీ మండలాల సభ్యులు కార్యకర్తలు, తదతరులు పాల్గొన్నారు. అనంతరం తర్లపాడు మండలంలో ఎంఈఓగా పదవీ విరమణ పొందిన అచ్యుత సుబ్బారావును ఘనంగా సన్మానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement