దర్శి: ఓ యువకుడు మద్యం తాగి కారును నడుపుతూ పలువురిని ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల కేంద్రం దర్శి పట్టణంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువకుడు ఒంగోలులోని ఓ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం చేస్తున్నాడు. వ్యక్తిగత పని కోసం దర్శి వచ్చిన అతను మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు తోలాడని, రోడ్డు వెంబడి ఉన్న ఆటోలతో పాటు పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయని స్థానికులు చెప్తున్నారు. క్షతగాత్రులను 108లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


