వైఎస్సార్ సీపీ, టీడీపీ ర్యాలీలపై ప్రజల్లో తీవ్ర చర్చ సాగింది. ఒకే సమయంలో రెండు పార్టీల ర్యాలీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంతో అటు జనాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ, ఆసక్తిని రేకెత్తించాయి. అధికారంలో ఉండి కూడా అట్టర్‌ఫ్లాప్ షోతో జనాల్లో పరువు పోగొట్టుకున్నారంటూ టీడీపీ ర్యాలీపై విమర్శలు వినిపించాయి. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దాదాపు అదే అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో వైఎస్సార్ సీపీ ర్యాలీ సూపర్ సక్సెస్ అంటూ అటు జనాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.


