నాడు–నేడు పనులపై దృష్టేదీ.. | - | Sakshi
Sakshi News home page

నాడు–నేడు పనులపై దృష్టేదీ..

Jun 12 2026 7:13 AM | Updated on Jun 12 2026 7:13 AM

గత వైఎస్సార్‌ సీపీ హయాంలో రెండో విడత నాడు –నేడులో జిల్లాలో 979 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. వీటితో పాటు అంగన్‌వాడీలు, డైట్‌ కళాశాలలను ఎంపిక చేశారు. వీటిల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 417.31 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో కొన్ని పాఠశాలల్లో నిర్మాణాలను పూర్తి చేయగా, కొన్నింట్లో నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. ఆ తరువాత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాఠశాలల్లో నాడు–నేడు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ రెండేళ్లలో పాఠశాలల్లో వసతులపై ఏనాడూ దృష్టి సారించలేదు. పాఠశాలల్లో 563 టాయిలెట్స్‌, 670 కిచెన్‌షెడ్స్‌, 522 అదనపు తరగతి గదులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. విద్యార్థులకు శుద్ధ జలాలు అందించాలని ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు చాలా నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని మరమ్మతులు కూడా చేయకపోవడంతో విద్యార్థులు తాగునీటికి అవస్థలు పడుతూనే ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement