ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Apr 22 2026 7:54 AM | Updated on Apr 22 2026 7:54 AM

పీఆర్టీయూ డిమాండ్‌

ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నరహరి అంజిరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరహరి అంజిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సర్వీస్‌ రూల్స్‌ రూపొందించాలన్నారు. నూతన పీఆర్సీ కమిటీ వేసి 30 శాతం ఐఆర్‌ మంజూరు చేయాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి వర్తింపజేయాలన్నారు. పెండింగ్‌ డీఏలు, జీపీఎఫ్‌/ ఏపీజీఎల్‌ఐ, ఈఎల్‌ ఎన్‌కాష్‌మెంట్‌ చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రిటైర్‌ అయిన రోజే ఇవ్వాలని, విశ్రాంత ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. 302 జీవో పునరుద్ధరించి జేఎల్‌ పదోన్నతులు కల్పించాలన్నారు. తెలుగు/హిందీ ప్రమోషన్ల లో ఎస్జీటీలకు 70 శాతం, డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌ వారికి 30 శాతం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉపాధ్యాయులకు జీపీఎఫ్‌ ఖాతాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవీ.రమణారెడ్డి, ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శరత్‌, కార్యదర్శి కృష్ణారెడ్డి, రిటైర్డు సంఘ నాయకులు అంకిరెడ్డి, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement