రైసు మిల్లులో అగ్ని ప్రమాదం
అద్దంకి: రైసు మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. అందులోని గోతాలు, ఇతర వస్తువులు కాలిపోయాయి. ఈ సంఘటన పట్టణంలోని చిన గానుగపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ఫైర్ సిబ్బంది అందించిన సమాచారం ప్రకారం.. చిన గానుగపాలెంలోని మద్దిశెట్టి సత్యనారాయణకు చెందిన నారాయణ రైస్ మిల్లులో అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు వరి పొట్టుకు నిప్పు అంటుకుంది. ఆ మంటలు క్రమంగా మిల్లులోకి చేరాయి. స్థానికుల సమాచారం మేరకు పైర్ అధికారులు అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. మిల్లులో ధాన్యం బస్తాలు లేవు. కేవలం గోనె సంచులు, కొన్ని వస్తువులు మాత్రమే కాలిపోయాయి. కాలిపోయిన వస్తువుల విలువ రూ.1.90 లక్షలు ఉంటుందని యజమాని తెలిపారు. సకాలంలో మంటలు అదుపులోకి తేవడంతో పరిసర ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.


