బాబు, లోకేష్‌వి దుర్మార్గపు రాజకీయాలు
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డికి గురువారం బెయిల్ మంజూరు కావడంతో ఒంగోలులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు స్వీట్లు పంపిణీ చేసి క్రాకర్స్ పేల్చి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. తద్వారా వైఎస్సార్ సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎంతో పవిత్రమైన తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై సైతం రాజకీయా లు చేయడం అన్యాయమన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేసిన ఆయిల్‌తో వండారని, పంది ఆయిల్ కూడా ఉపయోగించారని ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బహిరంగ ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. అలాంటిదేమీ జరగలేదని ప్రస్తుతం తేలడంతో నాలిక కరుచుకున్నారని అన్నారు. ఆనాటి టీటీడీ పాలకవర్గ బాధ్యతలు చూసిన ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిలను వ్యక్తిగతంగా, రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందని అన్నారు. సీబీఐ విచారణ నివేదికతో పాటు న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఆయిల్ ఉపయోగించలేదని తేలిందన్నారు. దీంతో భక్తులందరూ ఎంతో ఆనందోత్సాహాలు వెలిబుచ్చుతున్నారని, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి పాలకవర్గాలలో టీటీడీలో మంచి పరిపాలన, అభివృద్ధి జరిగిందని గుర్తుచేసుకుంటున్నారని బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. దుర్మార్గమైన రాజకీయాలు చంద్రబాబుకే సాధ్యమ ని అన్నారు. ఇప్పటికై నా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని, తిరుమల ఖ్యాతిని బలహీనపరిచే విధంగా వ్యవహరించిన సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లంగి రవీందర్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, నాయకుడు దుంపా చెంచిరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొగ్గుల శ్రీనివాస్‌రెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు పేరం ప్రసన్న, సయ్యద్ అప్సర్, జి.నాగమణి, షేక్ సమీర్, మధు, అమర్, ఫణిదపు సుధాకర్, షేక్ జిలాపీబాషా, యరజర్ల రమేష్‌బాబు, తోటపల్లి రవి, వెంకట్‌రెడ్డి, పల్నాటి సాయి యాదవ్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


