నేడు ఒంగోలుకు చెవిరెడ్డి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు ఒంగోలుకు చెవిరెడ్డి రాక

Jan 30 2026 6:36 AM | Updated on Jan 30 2026 6:36 AM

నేడు ఒంగోలుకు  చెవిరెడ్డి రాక

నేడు ఒంగోలుకు చెవిరెడ్డి రాక

నేడు ఒంగోలుకు చెవిరెడ్డి రాక ఏపీపీగా విజయలక్ష్మి

ఒంగోలు సిటీ: వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి శుక్రవారం ఒంగోలు రానున్నట్లు ఆ పార్టీ కార్యాలయ ప్రతినిధి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలులోని కిమ్స్‌ హాస్పిటల్‌ సమీపంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డికి వైఎస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలుకుతారని, అందరూ పాల్గొనాలని కోరారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 3 గంటలకు ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో చెవిరెడ్డి అందుబాటులో ఉంటారని, సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు.

మార్కాపురం టౌన్‌: స్థానిక ఆరో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ)గా కరణం విజయలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జి.విజయకుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు ఆమె కొనసాగనున్నారు. మార్కాపురం కోర్టులో మహిళా ఏపీపీ నియమితులవడం ఇదే మొదటిసారి కాగా, విజయలక్ష్మి ప్రస్తుతం మార్కాపురం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన న్యాయమూర్తులు, ప్రజా ప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement