పీడీసీసీబీ మాజీ చైర్మన్‌ శంకరరెడ్డి మృతి | - | Sakshi
Sakshi News home page

పీడీసీసీబీ మాజీ చైర్మన్‌ శంకరరెడ్డి మృతి

Jan 30 2026 6:36 AM | Updated on Jan 30 2026 6:36 AM

పీడీసీసీబీ మాజీ చైర్మన్‌  శంకరరెడ్డి మృతి

పీడీసీసీబీ మాజీ చైర్మన్‌ శంకరరెడ్డి మృతి

ఒంగోలు సిటీ:

పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ మేదరమెట్ల శంకరరెడ్డి (82) గురువారం మృతి చెందారు. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామానికి చెందిన శంకరరెడ్డి ఒంగోలులో నివాసం ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాంట్రాక్టర్‌గా తన జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగారు. జెడ్పీలో కాంగ్రెస్‌ పార్టీ అపోజిషన్‌ లీడర్‌గా వ్యవహరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో పీడీసీసీబీ చైర్మన్‌గా పనిచేసి అందరి మన్ననలు పొందారు. శంకరరెడ్డి మృతికి వైఎస్సార్‌ సీపీ నాయకులు పలువురు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement