ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగంగా భారత్
ఒంగోలు సబర్బన్: ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా భారత రాజ్యాంగం అవతరించిందని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలక్రిష్ణతో కలిసి తీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన నాలుగు సింహాల స్థూపాన్ని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలక్రిష్ణ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, సీపీఓ సుధాకర్‌రెడ్డి, డీఈఓ రేణుక, జిల్లా పౌర సరఫరా అధికారి పద్మశ్రీ కలెక్టరేట్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ పి.రాజాబాబు


