పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
● దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
దర్శి: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గ్రామ కమిటీల నిర్మాణంపై మండల పార్టీ అధ్యక్షుడు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ మండల పరిశీలకులు, గ్రామ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలను పూర్తి చేసే విధానం గురించి వివరించారు. ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ కమిటీతో పాటు యువత, మహిళా, రైతు, బీసీ, ఎస్సీ, సోషల్ మీడియా, విద్యార్థి కమిటీలు వేయాలని సూచించారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. అందరూ కలిసికట్టుగా పని చేసి 2029లో జగనన్నను మరోమారు సీఎం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించి అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు. కార్యక్రమంలో దర్శి అసెంబ్లీ పరిశీలకుడు బొట్ల రామారావు, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల కృష్ణారెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, చింతా శ్రీనివాసరెడ్డి, తూము వెంకటసుబ్బారెడ్డి, ఎంపీపీ ఉషా మురళి, జెడ్పీటీసీలు నుసుం వెంకట నాగిరెడ్డి, తాతపూడి రత్నరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మా రెడ్డి, దర్శి పట్టణ అధ్యక్షుడు ముత్తి నీడి సాంబయ్య, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గ బూత్ అధ్యక్షుడు కర్ణాటి ఆంజనేయరెడ్డి, రాష్ట్ర క్రిష్టియన్ సెల్ కార్యదర్శి గుంటు పోలయ్య, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సైదా, పంచాయతీరాజ్ నియోజకవర్గ అధ్యక్షుడు మేరువసుబ్బారెడి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగులమూడి లింగారెడ్డి, మాజీ ఎంపీపీలు వీరగంధం కోటయ్య, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు నిమ్మకాయల రాజయ్య యాదవ్, సాంస్కృతిక విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జక్కుల రామకృష్ణ, జిల్లా బూత్ కమిటీ కార్యదర్శి కటకం శెట్టి శ్రీను, జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి పూనూరి దేవదానం, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, ఉపసర్పంచ్ పులి ప్రసాద్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


