వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
మార్కాపురం: వృద్ధురాలి మెడలో గొలుసు చోరీకి గురైంది. పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి రథ సప్తమి వేడుకలను తిలకించేందుకు కురిచేడు నుంచి వచ్చిన జవ్వాజి రంగ సుబ్బులు అమ్మవారిశాల వద్ద ఉన్న అన్నదానం కౌంటర్ వద్ద ప్రసాదం తీసుకుంటున్న సమయంలో దుండగులు నాలుగు సవర్ల బంగారు గొలుసును చోరీ చేసినట్లు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
తప్పిపోయిన పాప తల్లిదండ్రులకు అప్పగింత..
రథసప్తమి వేడుకలను చూసేందుకు తల్లిదండ్రులతో వచ్చిన బాలిక తప్పిపోయింది. శివాజీ నగర్ మొదటి లైన్‌లో నివాసముండే శ్రీనివాసులు కుమార్తె నీలవేణి స్వామిని చూసేందుకు వచ్చి తప్పిపోయింది. వెంటనే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి వారి చెంతకు చేర్చారు.
● మరొకరికి గాయాలు
కొనకనమిట్ల: బైక్‌ను వెనుక నుంచి కారు అదుపుతప్పి ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన 565 జాతీయ రహదారి కొనకనమిట్ల మండలం పెదారికట్ల సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం గ్రామానికి చెందిన శ్రీరామ్ నాగేంద్రబాబు(35) వృత్తి రిత్యా బేల్దారీ మేస్త్రి. కూలీల కోసం తన స్నేహితుడైన పొదిలి మండలం నందిపాలెం గ్రామానికి చెందిన పోతురాజు ప్రసాద్‌ను తీసుకొని మోటార్ సైకిల్‌పై పెదారికట్ల వెళ్లారు. అక్కడ పని పూర్తయిన తరువాత పెదారికట్ల నుంచి పొదిలి వైపు ఇద్దరు మోటార్ సైకిల్‌పై వస్తున్నారు. కొద్ది దూరం వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న కారు అదుపుతప్పి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరి కిందపడి గాయపడ్డారు. ఇద్దరిని చికిత్స నిమిత్తం పొదిలి వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నాగేంద్రబాబు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన పోతురాజు ప్రసాదు పొదిలి ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు నాగేంద్రబాబుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉభ్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
మృతుడు నాగేంద్రబాబు
(ఫైల్)
వైద్యశాలలో చికిత్స పొందుతున్న పోతురాజు ప్రసాద్
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ


