బీడీ అడిగాడని మద్యం మత్తులో దాడి | - | Sakshi
Sakshi News home page

బీడీ అడిగాడని మద్యం మత్తులో దాడి

Jan 26 2026 4:10 AM | Updated on Jan 26 2026 4:10 AM

బీడీ అడిగాడని మద్యం మత్తులో దాడి

బీడీ అడిగాడని మద్యం మత్తులో దాడి

ముండ్లమూరు(దర్శి): మద్యం మత్తులో బీడీ అడిగాడని కత్తితో దాడి చేయడంతో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శనివారం రాత్రి మండల పరిధిలోని ఈదర గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఈదర గ్రామానికి చెందిన కురిచేడు శ్రీనివాసరావు కూలీ పనులుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కట్టెల లోడుకు కూలి పనికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 9:30 గంటల సమయంలో గ్రామ శివారులో మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడ మద్యం తాగతున్న బంధువైన ఆవులమంద రాఘవయ్యను బీడీ ఇవ్వమని అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రాఘవయ్య నిన్ను చంపేస్తాను అంటూ ఇంటికి వెళ్లి కత్తి తీసుకువచ్చి బాబాయి కొట్టి దాటిన తరువాత శ్రీనివాసరావుపై కత్తితో దాడి చేశాడు. ఎడమ పొట్టలో, ఎడమ చేతి మోచేతి వద్ద పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముండ్లమూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement