58 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
పామూరు: డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరి దుకాణాలపై శుక్రవారం ఒంగోలు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వారి వద్ద నుంచి 58 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 6ఏ కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... పామూరులో డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నట్లు ఒంగోలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పీ కొల్లి శ్రీనివాసరావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఒంగోలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు రవిబాబు, రాఘవరావు, డీసీటీ రామారావు, ఎస్సై నాగేశ్వరరావు, సివిల్ సప్లయిస్ డీటీ రాఘవేంద్ర భూపతి ఆధ్వర్యంలో రెండు దుకాణాలపై దాడులు నిర్వహించారు. పామూరులోని కనిగిరి రోడ్డులో శ్రీమణికంఠ ప్రొవిజన్స్ అండ్స్ ఫ్యాన్సీషాప్‌లో అనుమతులు లేకుండా యజమాని గుంటూరు నారాయణ అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లను నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సోదాలు చేశారు. ఆ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 21 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసి స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వారికి అప్పగించారు. సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నందుకు బాధ్యుడైన గుంటూరు నారాయణపై చర్య నిమిత్తం 6ఏ కేసు నమోదు చేశారు. అదేవిధంగా విరువూరురోడ్డుకు చెందిన రామారావు అనే వ్యక్తి కోడిగుడ్ల దుకాణంలో అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లు నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన వివిధ కంపెనీలకు చెందిన 37 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసి వాటిని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ, పామూరు వారికి అప్పగించారు. సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచిన రామారావుపై చర్య నిమిత్తం 6ఏ కేసు నమోదు చేశారు. ఎవరైనా, ఎక్కడైనా అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటిపై తమకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు.
● జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
మార్కాపురం రూరల్(మార్కాపురం టౌన్): ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని, నిర్భయంగా ఓటు వేయాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం సాయంత్రం సబ్‌కలెక్టరు కార్యాలయంలో అధికారులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ శివరామిరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి, కమిషనర్ నారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా స్వామ్యంలోని పౌరులందరూ ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని ఎంపీడీఓ బాలచెన్నయ్య అన్నారు. శుక్రవారం ఎంపీడిఓ కార్యాలయంలో 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎల్‌ఓ, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
మార్కాపురం: మార్కాపురం డివిజన్ మైనింగ్ ఏడీగా ఎస్‌పీకే మల్లేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ గా పని చేస్తున్న ఎస్‌పీకే మల్లేశ్వరరావును పదోన్నతిపై మార్కాపురం జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమిస్తూ మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అక్రమంగా నిల్వ ఉంచిన ఇద్దరిపై 6ఏ కేసు నమోదు


