వివాదాస్పద భూమి పరిశీలన | - | Sakshi
Sakshi News home page

వివాదాస్పద భూమి పరిశీలన

Jan 24 2026 7:10 AM | Updated on Jan 24 2026 7:10 AM

వివాదాస్పద భూమి పరిశీలన

వివాదాస్పద భూమి పరిశీలన

వివాదాస్పద భూమి పరిశీలన

పామూరు నుంచి కోడిగుడ్లపాడు వెళ్లే రోడ్డులో సర్వే నంబర్‌ 266/7లోని 3.67 ఎకరాల భూమి తమదని ఓ వ్యక్తి ఇటీవల గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చాడు. ఇది దేవదాయశాఖ భూమి సంబంధిత అధికారులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్డీఓ కేశవర్థన్‌రెడ్డి స్థానిక తహసీల్దార్‌ రామచంద్రుని వాసుదేవరావుతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఆలయ ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు ఆలయ భూములకు చెందిన ఎఫ్‌ఎల్‌ఆర్‌, పాస్‌బుక్‌, 1–బి, అడంగల్‌, 43 రిజిస్టర్‌ లాంటి కీలకమైన అధికారిక రికార్డులు విచారణ సమయంలో ఆర్డీఓకు సమర్పించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కాగా.. ఆలయ భూములు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ కేశవర్ధన్‌రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement