గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

Jan 23 2026 6:33 AM | Updated on Jan 23 2026 6:33 AM

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

పామూరు: గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 36 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మాకినేని శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో ఎస్సై కట్టా అనూక్‌తో కలిసి సీఐ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. పామూరులోని నానాసాహెబ్‌ వీధికి చెందిన ముజ్జా సాయి కేశవ్‌ చెడు వ్యసనాలకు అలవాటుపడి కొంతకాలంగా హైదరాబాద్‌లోని గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి రూ.200 చొప్పున విక్రయిస్తున్నాడు. 20వ తేదీన సాయి కేశవ్‌ హైదరాబాద్‌వెళ్లి 36 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి పామూరుకు వచ్చాడు. ఈ క్రమంలో పామూరు నుంచి కందుకూరు వెళ్లే రోడ్డులో కోటిరెడ్డి ఫ్లాట్స్‌ జంక్షన్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో సాయి కేశవ్‌ను అరెస్టు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఎక్కడైనా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నా, తరలిస్తున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎస్సై కట్టా అనూక్‌, హోంగార్డ్‌ రమణయ్య, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement