వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

Jan 23 2026 6:33 AM | Updated on Jan 23 2026 6:33 AM

వేర్వ

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

లింగసముద్రం: ఎదురెదురుగా రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని మొగిలిచర్ల రోడ్డులో ఆర్‌ఆర్‌పాలెం వద్ద గురువారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే..మొగిలిచర్ల గ్రామానికి చెందిన మాజీ రేషన్‌ డీలర్‌ పల్లాల రామ్మూర్తిరెడ్డి(58) మొగిలిచర్ల నుంచి లింగసముద్రానికి బైక్‌పు వెళుతున్నాడు. అదే సమయంలో ఆర్‌ఆర్‌ఎం పాలెం గ్రామానికి చెందిన చింతగుంపల మాల్యాద్రి(60) కూలీలను వదిలిపెట్టి పెంట్రాల వైపు నుంచి ఆర్‌ఆర్‌పాలెం గ్రామానికి వస్తుండగా ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు మోటార్‌ సైకిళ్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో రామ్మూర్తిరెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కిందపడిన మాల్యా ద్రి కూడా బలమైన గాయాలు కాగా అపస్మారకస్థితికి వెళ్లాడు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై నారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలకు పంచానామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కందుకూరుకు తరలించారు. ఇరువురు కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలంలోనే మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. మొగిలిచర్ల, ఆర్‌ఆర్‌ పాలెం గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

వలేటివారిపాలెం: గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బొంతవారిపాలెం ఐటీఐ కాలేజీ దగ్గర 167 బీ వద్ద గురువారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు...తెనాలి మండల పెదరావురు గ్రామానికి చెందిన బొగినేని అరవింద్‌(24) గత నెలలో శాఖవరంలో పచ్చాకు కూలి పనికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి గ్రామంలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబ పని నిమిత్తం కందుకూరు వెళ్లి తిరిగి వస్తుండగా ఐటీఐ కాలేజీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు ఎస్సై మదిరి నాయుడు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కందుకూరు వైద్యశాలకు తరలించారు. తండ్రి భోగినేని కిషోర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.

ఎదురెదురుగా బైక్‌లు ఢీకొనడంతో ప్రమాదం

రెండు కుటుంబాల్లో విషాదం

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం 1
1/2

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం 2
2/2

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement