రెండు పొగాకు బ్యారెన్లు దగ్ధం
నాగులుప్పలపాడు: మండల పరిధిలోని బి.నిడమానూరు గ్రామంలో పొగాకు బ్యారన్ దగ్ధమైంది. ఈ సంఘటన గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..డాకా అంజిరెడ్డికి చెందిన పొగాకు బ్యారెన్‌లో పొగాకు క్యూరింగ్ జరుగుతున్న సమయంలో మొద్ద గొట్టంపై నుంచి కర్ర జారిపడి మంటలు వ్యాపించాయి. దీంతో బ్యారన్‌లోని పొగాకు మొత్తం కాలిపోయాయి. మరో జంట బ్యారన్ లో ఉన్న పొగాకు కూడా కొంత మేరకు కాలిపోయినట్లు తెలిపారు. ప్రమాదం వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.7 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది.
టంగుటూరు: మండలంలోని ఎం నిడమానూరులో పొగాకు బ్యార్నీ దగ్ధమైంది. గ్రామానికి కాకుమాని కోటమ్మ బ్యారన్‌లో క్యూరింగ్ నిమిత్తం 1200 పొగాకు కర్ర పెట్టారు. అయితే కర్ర జారి మొద్దు గొట్టంపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో పొగాకు కర్రతో పాటు, కర్ర, టైర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించలేదని, సకాలంలో వచ్చి ఉంటే కొంత మేర ఆస్తినష్టం తప్పేదంటున్నారు. ప్రమాదంలో రూ.3.50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది.
రెండు పొగాకు బ్యారెన్లు దగ్ధం


