గవర్నర్‌ ఎట్‌ హోమ్‌కు అద్దంకి వ్యక్తి | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ ఎట్‌ హోమ్‌కు అద్దంకి వ్యక్తి

Jan 23 2026 6:33 AM | Updated on Jan 23 2026 6:33 AM

గవర్నర్‌ ఎట్‌ హోమ్‌కు  అద్దంకి వ్యక్తి

గవర్నర్‌ ఎట్‌ హోమ్‌కు అద్దంకి వ్యక్తి

గవర్నర్‌ ఎట్‌ హోమ్‌కు అద్దంకి వ్యక్తి ఆర్టీసీ కార్మికులుఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

అద్దంకి రూరల్‌: రిపబ్లిక్‌డే సందర్భంగా ఈ నెల 26న విజయవాడలోని లోక్‌ భవన్‌లో నిర్వహించనున్న గవర్నర్‌ ఎట్‌ హోమ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు అహ్వానం అందినట్లు అద్దంకి మండలం మొండితోకపాలేనికి చెందిన వ్యక్తి సుకుమార్‌ గురువారం తెలిపారు. సుకుమార్‌ గతేడాది అద్దంకిలోని గుండ్లకమ్మ నదిలో చిక్కుకున్న మున్సిపల్‌ సిబ్బందిని కాపాడారు. నీటి ఉధృతిలో పడవలో వెళ్లి ఒక్కొక్కరిని ధైర్యంగా ఒడ్డుకు తీసుకొచ్చి కాపాడారు. ధైర్యసాహసానికి మెచ్చి గవర్నర్‌ నుంచి అహ్వానం అందినట్లు చెప్పారు.

మార్కాపురం టౌన్‌: ఆర్టీసీ కార్మికులు ఉద్యోగ భధ్రతతో పాటు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని మార్కాపురం ఇన్‌చార్జి ఆర్‌ఎం సత్యనారాయణ సూచించారు. స్థానిక మార్కాపురం డిపోను, బస్టాండ్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చవచ్చన్నారు.

ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు భావిస్తే వెంటనే వైద్యశాలకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే డ్రైవింగ్‌ సమయంలో ఇబ్బందులు గురై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. మార్కాపురం జిల్లా సందర్భంగా కార్యాలయ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. శిబిరంలో 60 మంది ఆర్టీసీ ఉద్యోగులు వైద్య పరీక్షలు చేశారు. డీఎం నరసింహులు, సిబ్బంది, యూనియన్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement