జనసేన నేతపై కేసు నమోదు
అద్దంకి రూరల్: సివిల్ కేసులో ఇరువర్గాల మధ్య పంచాయితీ చేస్తానని రెండు రోజుల క్రితం అద్దంకి పోలీసుస్టేషన్‌కు వచ్చిన జనసేన నాయకుడు వల్లభనేని కృష్ణచౌదరిపై సీఐ సుబ్బరాజు కేసు నమోదు చేసినట్లు హైకోర్టు న్యాయవాది రజని తెలిపారు. గురువారం అద్దంకి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆమె జనసేన నాయకులపై ధ్వజమెత్తారు. బాధితుల తరఫున న్యాయవాదిగా వచ్చిన తాను తప్పు చేసిన వారు ఎంతటి వారైనా నిలదీస్తానన్నారు. ఆమె వెంట బాధితులు ఉన్నారు.
యర్రగొండపాలెం: మండలంలోని గురిజేపల్లిలో గురువారం మిర్చి పొలంలో బోరు మరమ్మతులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై కందుల పిచ్చిరెడ్డి (23) మృతి చెందాడు. ఎస్సై చౌడయ్య తెలిపిన వివరాల ప్రకారం..మిర్చి పొలంలో బోరు చెడిపోవడంతో బోరుపైపులు భూమిలో నుంచి క్రేన్ ద్వారా పైకి లాగుతున్న సమయంలో క్రేన్‌కు విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
జనసేన నేతపై కేసు నమోదు


