లక్ష్మమ్మకు వైవీ సుబ్బారెడ్డి నివాళులు | - | Sakshi
Sakshi News home page

లక్ష్మమ్మకు వైవీ సుబ్బారెడ్డి నివాళులు

Jan 23 2026 6:33 AM | Updated on Jan 23 2026 6:33 AM

లక్ష్మమ్మకు వైవీ సుబ్బారెడ్డి నివాళులు

లక్ష్మమ్మకు వైవీ సుబ్బారెడ్డి నివాళులు

పీసీ పల్లి: మండలంలోని మూలవారిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు గుర్రంపాటి దశరథ రామిరెడ్డి తల్లి గుర్రంపాటి లక్ష్మమ్మ ఈ నెల 9వ తేదీ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి గురువారం ఆ గ్రామానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దశరథ రామిరెడ్డి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. వైవీ సుబ్బారెడ్డి వెంట వైవీ భద్రారెడ్డి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, పీడీసీసీబీ మాజీ చైర్మన్లు వైఎం ప్రసాద్‌ రెడ్డి (బన్నీ), మాదాసు వెంకయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వైవీ వెంకటేశ్వరరావు, కేవీ ప్రసాద్‌, కనిగిరి జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, పీసీ పల్లి సొసైటీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ పోలు జయరాంరెడ్డి, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నరాల కొండారెడ్డి, ఒమేగా రామిరెడ్డి, దుంప వెంగలరెడ్డి, లింగాల దిననరసింహారెడ్డి, మేకల మాల్యాద్రి యాదవ్‌, శీలం సుదర్శనం, సిద్ధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement