మార్కాపురం విద్యార్థినికి ఆహ్వానం
గవర్నర్ ఎట్ హోంకు
మార్కాపురం టౌన్: ఈనెల 26న అమరావతిలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ నిర్వహించే ఎట్‌హోం కార్యక్రమానికి మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన శాలిని సంహితకు గవర్నర్ కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం ఆహ్వానం అందింది. సంహిత గత ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3వ ర్యాంక్ సాధించింది. టెన్త్‌లో 600కు 598 మార్కులు సాధించిన విద్యార్థినిగా గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లు ఇన్‌చార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి తెలిపారు. సంహిత తండ్రి రమణయ్య ప్రస్తుతం బల్లికురవ మండలం ఉప్పుమాగులూరులో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తన కుమార్తెకు గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. సంహిత ప్రస్తుతం ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం గుంటూరులో చదువుతున్నట్లు తెలిపారు.


