ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌

Jan 22 2026 6:51 AM | Updated on Jan 22 2026 6:51 AM

ఇంట్ల

ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌

ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ బిల్డింగ్‌ నుంచి పడి యువకుడి దుర్మరణం పోలీస్‌ లాంఛనాలతో సాజిద్‌ అంత్యక్రియలు

రాచర్ల: నివాస గృహంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిన సంఘటన మండలంలోని జేపీ చెరువులో వెలుగు చూసింది. అందిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్టా గురుమూర్తి ఇంట్లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించడంతో విలువైన సామగ్రితో పాటు బియ్యం, మొక్కజొన్న విత్తనాలు, దుస్తువులు, మంచాలు పూర్తిగా కాలిపోయాయి. నివాస గృహంలో చెలరేగుతున్న మంటలను స్థానికులు నీళ్లు చల్లి అదుపు చేశారు.

మేదరమెట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన షేక్‌ ఇమామ్‌ బాషా (32) మంగళవారం అర్ధరాత్రి సమయంలో మూడు అంతస్తుల బిల్డింగ్‌ నుంచి కిందపడి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. చికెన్‌ షాప్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇమామ్‌బాషా నాలుగు రోజుల నుంచి మద్యం తాగుతూ మతిస్థిమితం లేక రోడ్లపై తిరుగుతూ తనని ఎవరో చంపుతున్నారు..వెంబడిస్తున్నారని పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. మంగళవారం రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న కత్తితో గొంతులో పొడుచుకోగా అతని తల్లి కరిమున్‌ స్థానిక వైద్యశాలకు తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందకుండా అర్ధరాత్రి సమయంలో పోస్టాఫీస్‌ పక్కన మూడు అంతస్తుల బిల్డింగ్‌ ఎక్కి పరిగెత్తుతూ కిందపడిపోయాడు. బలమైన గాయాలు కావడంతో బంధువులు హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మేదరమెట్ల ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

కందుకూరు:

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన పట్టణ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ సాజిద్‌(39) అంత్యక్రియలు బుధవారం స్థానిక ఖబరిస్తాన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సాజిద్‌ మృతదేహానికి పలువురు పోలీస్‌ అధికారులు నివాళులర్పించారు. గుండెపోటుకు గురైన తల్లిని హాస్పిటల్‌కి తరలించే క్రమంలో ప్రమాదానికి గురై మృతి చెందడం బాధాకరమైన విషయమని, మరో పక్క తల్లి కూడా మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటన్నారు. సాజిద్‌ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, శాఖాపరంగా రావాల్సిన అన్ని లాంఛనాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఖబరిస్తాన్‌లో పోలీస్‌లాంఛనాలతో సాజిద్‌ అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ 1
1/2

ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌

ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ 2
2/2

ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement