రిపబ్లిక్ డే పరేడ్‌కు ఏర్పాట్లు
మార్కాపురం: జిల్లా కేంద్రం మార్కాపురంలో ఈ నెల 26న జరిగే మొదటి రిపబ్లిక్ డే వేడుకలకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్‌వీకేపీ కళాశాల గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహిస్తుండగా కలెక్టర్ బంగళాలో సాయంత్రం ఎట్‌హోమ్ కార్యక్రమాన్ని, ఎస్పీ కార్యాలయంలో పరేడ్ నిర్వహించేందుకు మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వివిధ శాఖల శకటాలు పరేడ్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో ఎస్‌వీకేపీ కళాశాల ప్రాంగణాన్ని కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో సిబ్బంది చదును చేసి సున్నంతో మార్కింగ్ వేసి పరేడ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం రోజూ పరేడ్ రిహార్సల్స్ చేస్తోంది. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు సోమవారం తన కార్యాలయంలో పరేడ్ ఏర్పాట్లపై సమీక్షించారు. మొదటిసారి మార్కాపురంలో జరిగే కార్యక్రమం ఘనంగా ఉండాలని ఆదేశించారు. ఎస్పీ కార్యాలయ ప్రాంగణం మొత్తం చదును చేశారు. కార్యాలయానికి రంగులు కూడా వేశారు. కలెక్టర్ బంగళాను కూడా ఎట్‌హోమ్ కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు. మొదటిసారిగా జరిగే రిపబ్లిక్ డే వేడుకలను అన్నీశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు.
రిపబ్లిక్ డే పరేడ్‌కు ఏర్పాట్లు


