రెవెన్యూ రికార్డుల పరిశీలన
ఒంగోలు వన్‌టౌన్:
ఒంగోలు కలెక్టరేట్‌లోని రికార్డులు రూంను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భ,గా మార్కాపురం జిల్లా రెవెన్యూ రికార్డులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పడినందున, ఆ జిల్లా జిల్లా రెవెన్యూ రికార్డుల విభజన ప్రక్రియను డీఆర్‌ఓ, సంబంధిత సెక్షన్ అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ టి.రవి, సంబంధిత సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.


