విజ్ఞానయాత్రలతో ఎంతో మేలు | - | Sakshi
Sakshi News home page

విజ్ఞానయాత్రలతో ఎంతో మేలు

Jan 21 2026 6:43 AM | Updated on Jan 21 2026 6:43 AM

విజ్ఞ

విజ్ఞానయాత్రలతో ఎంతో మేలు

విజ్ఞానయాత్రలతో ఎంతో మేలు వ్యాధుల నియంత్రణకు

ఒంగోలు సబర్బన్‌: విజ్ఞాన యాత్రలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన రైతుల విజ్ఞాన యాత్రకు బయలుదేరిన బస్సులకు కలెక్టర్‌ సోమవారం రాత్రి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి బస్సులు బయలుదేరాయి. దర్శి, కురిచేడు, అద్దంకి, సింగరాయకొండ పరిసర ప్రాంతాల నుంచి 35 మంది రైతులను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ కుప్పం, పలమనేరు, గంగపాలెం, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉద్యాన పంటలు, ఉత్పత్తుల విలువ జోడింపు, ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్వహణపై అవగాహన కోసం రైతులు బయలుదేరి వెళ్లారు. జిల్లా ఉద్యాన అధికారి వై గోపీచంద్‌ మాట్లాడుతూ రెండు రోజుల పాటు విజ్ఞాన యాత్ర జరుగుతుందని తెలిపారు. రైతుల వెంట దర్శి ఉద్యాన అధికారి పి. రవి వెంకన్న బాబు, ఉద్యాన అధికారి దర్శి, కొత్తపట్నం ఉద్యాన విస్తరణ అధికారి వంశీకృష్ణ ఉన్నారు.

కృషి చేయాలి

కందుకూరు: కీటక జనిత వ్యాధులు, సీజనల్‌ వ్యాధుల నియంత్రణలో కీలక పాత్ర పోషించి ప్రజారోగ్య పరిరక్షణకు పాటుపడాలని జిల్లా మలేరియా అధికారి ఎన్‌ మధుసూదనరావు మగ ఆరోగ్య సహాయకులకు సూచించారు. లింగసముద్రం, వలేటివారిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన ఆయన స్థానిక ఎన్‌జీఓ హోంలో ఆరోగ్య సహాకులతో సమావేశం నిర్వహించారు. కీటక జనిత, సీజనల్‌ వ్యాధులపై ఆరోగ్య సహాయకులు ఆప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధులు ప్రబలితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రూపు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా పనిచేయాలన్నారు. సీహెచ్‌ఓ శ్రీనివాసులు, జీవీవీ ప్రసాదరావు, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

విజ్ఞానయాత్రలతో ఎంతో మేలు 1
1/1

విజ్ఞానయాత్రలతో ఎంతో మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement