కలెక్టర్‌కు ప్రత్యేక అవార్డు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు ప్రత్యేక అవార్డు

Jan 21 2026 6:42 AM | Updated on Jan 21 2026 6:42 AM

కలెక్టర్‌కు ప్రత్యేక అవార్డు

కలెక్టర్‌కు ప్రత్యేక అవార్డు

ఓటర్ల జాబితా మ్యాపింగులో పనితీరుకు గుర్తింపు

ఒంగోలు సబర్బన్‌: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ సమ్మరీ (ఎస్‌.ఐ.ఆర్‌) –2026లో ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబుకు ప్రత్యేక అవార్డు దక్కింది. ఓటర్ల మ్యాపింగ్‌లో సాధించిన పురోగతికిగాను బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డ్స్‌–2025కు ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. 2002 ఎస్‌ఐఆర్‌ డేటాతో 2026 ఎస్‌ఐఆర్‌ డేటాను సరిపోల్చటంలో కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 25వ తేదీన విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును కలెక్టర్‌ అందుకోనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పి.రాజా బాబును పలువురు జిల్లా అధికారులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కలెక్టర్‌ను అభినందించిన వారిలో డీఆర్‌ఓ బీసీహెచ్‌.ఓబులేసుతో పాటు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement