బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసరుగా సబ్‌కలెక్టర్ శివరామిరెడ్డి
మార్కాపురం: మార్కాపురం ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ ఎం.శివరామిరెడ్డి ఓటర్ల జాబితా మ్యాపింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈనెల 25న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆవార్డు అందుకోనున్నారు. గిద్దలూరు నియోజకవర్గ ఎన్నికల అధికారిగా ఉన్న శివరామిరెడ్డి ఓటర్ల జాబితా, స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మరీలో మంచి ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2002 ఎస్‌ఐఆర్ డేటాతో, 2026 ఎస్‌ఐఆర్ డేటాను సరిపోల్చడంలో శివరామిరెడ్డి జిల్లాలోనే ప్రతిభ కనబరిచారు. ఈనెల 25న ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ప్రస్తుతం ఆయన పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కంభం యూనిట్ ఎస్‌డీసీగా, మార్కాపురం ఇన్‌చార్జి సబ్‌కలెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శివరామిరెడ్డిని పలువురు అధికారులు అభినందించారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షునిగా పట్టణానికి చెందిన ఎంఆర్‌కే బాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రఫీ ఆదేశాల మేరకు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ముస్లింల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు.
మార్కాపురం: కర్నూలు, గుంటూరు, మార్కాపురం జిల్లాలో ఉన్న మొత్తం 23 ఆశ్రమ పాఠశాలలు ఇకనుంచి ఐటీడీఏ పరిధిలోనికి రానున్నాయి. ఈ మేరకు ఈనెల 19న ప్రభుత్వ కార్యదర్శి ఎంఎం నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ ఈ ఆశ్రమ పాఠశాలలన్నీ ఆయా జిల్లాల్లోని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ ఆధీనంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఐటీడీఏ పరిధిలోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 3, నూతన మార్కాపురం జిల్లాలోని పుల్లలచెరువు, పెద్దారవీడు, యర్రగొండపాలెం, అర్ధవీడు, పెద్దదోర్నాల మండలాల్లో ఉన్న 14 ఆశ్రమ పాఠశాలలు ఇకనుంచి ఐటీడీఏ పరిధిలోకి రానున్నాయి. ఈ మూడు జిల్లాల్లోని ఆశ్రమ పాఠశాలలను పర్యవేక్షించే ఐటీడీఏ కార్యాలయం శ్రీశైలం ప్రాజెక్టు (సున్నిపెంట)లో ఉంది. పుల్లలచెరువు, పాణ్యం శివపురం, మహానంది, కొత్తచెరువు, అహోబిలం ఆశ్రమ పాఠశాలలు ఐటీడీఏ పరిధిలోకి రానున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన చెంచు విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం అందించే లక్ష్యంతో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
సింగరాయకొండ: పురాణ ప్రసిద్ధి చెందిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామికి పంచామృతాభిషేకం, తిరుప్పావడ సేవ నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఏడు నెలల ఆరు రోజులకు రూ. 5.57,374 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పి.కృష్ణవేణి తెలిపారు. కందుకూరు దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసరుగా సబ్‌కలెక్టర్ శివరామిరెడ్డి


