వైఎస్సార్ సీపీ బలోపేతానికి సమష్టి కృషి
మార్కాపురం: వైఎస్సార్ సీపీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు అందరం కలసికట్టుగా కృషి చేద్దామని, వచ్చే ఎన్నికల్లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఆ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు పేర్కొన్నారు. పార్టీ గ్రామ కమిటీ నిర్మాణంలో భాగంగా మంగళవారం ఆయన తర్లుపాడు మండలంలోని గానుగపెంట, రాగసముద్రం, కలుజువ్వలపాడు గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాన్ని పక్కనబెట్టి, ప్రస్తుతం పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా తనతోపాటు పార్టీ కూడా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టాలెప్పుడూ కంటిన్యూగా ఉండవని, భవిష్యత్తు వైఎస్సార్ సీపీదే అని చెప్పారు. గ్రామ కమిటీలను పార్టీ శ్రేణుల ఆమోదంతోనే ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పార్టీ పదవులు పొందిన నాయకులంతా కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ముందుగా ఆయా గ్రామాల్లో అన్నా రాంబాబుకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఆయా సమావేశాల్లో ఎంపీపీ భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మురారి వెంకటేశ్వర్లుతోపాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులైన బాలయ్య, చెన్నకేశవులు, రమణారెడ్డి, శిఖామణి, పోటు గురవయ్య, మందా కొండారెడ్డి, తిరుపతిరెడ్డి, భూపాల్‌రెడ్డి, శివారెడ్డి, మహేష్, చార్లెస్, దేవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, తిరుపాలయ్య, గుమ్మా రాజేంద్ర ప్రసాద్, గాయం బొర్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏ కష్టమొచ్చినా తనతోపాటు
పార్టీ అండగా ఉంటుంది
కార్యకర్తలు, నాయకులకు
మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు భరోసా
తర్లుపాడు మండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుపై సభలు


