సచివాలయ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి

Jan 21 2026 6:42 AM | Updated on Jan 21 2026 6:42 AM

సచివాలయ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి

సచివాలయ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి

కడప ఉద్యోగి మృతికి క్యాండిల్‌ ర్యాలీ

మార్కాపురం: సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం పనిభారం తగ్గించాలని ఏపీఎన్‌జీఓ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బీవీఎస్‌ శాస్త్రి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో పనిఒత్తిడితో చనిపోయిన హెల్త్‌ సెక్రటరీ విజయకుమారి మృతికి నివాళులర్పిస్తూ క్యాండిల్‌ ర్యాలీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. డాక్టర్‌ శాస్త్రి మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించి నిర్ధిష్టమైన జాబ్‌చార్టు తయారుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వివిధ సచివాలయాలకు చెందిన 30 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పనిఒత్తిడితో మృతి చెందిన విజయకుమారికి ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement