మోసగాడు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మోసగాడు అరెస్టు

Jan 20 2026 8:25 AM | Updated on Jan 20 2026 8:25 AM

మోసగాడు అరెస్టు

మోసగాడు అరెస్టు

హనుమారెడ్డికి నివాళులు

గుడ్లూరు: పోన్‌ పే చేస్తా..నగదు ఇవ్వాలని నకిలీ స్క్రీన్‌ షాట్‌ చూపించి మోసగించబోయిన వ్యక్తిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే..బెయిన్‌ బజారులో గుర్తు తెలియని వ్యక్తి సెల్‌ దుకాణంలోకి వెళ్లి పోన్‌ పే చేస్తాను.. నగదు ఇవ్వమని అడిగాను. దీనికి దుకాణదారుణ సరే అనడంతో నగదు పోన్‌పే చేసినట్లు స్క్రీన్‌ చూయించాడు. అయితే దుకాణదారుడు తన మొబైల్‌లో చెక్‌ చేసుకోగా నగదు జమ కాలేదు. దీనిపై సదరు వ్యక్తిని ప్రశ్నించగా నెట్‌వర్క్‌ సక్రమంగా లేదని మెల్లగా జారుకున్నాడు. ఇటీవల ఇదే తరహాలో మోసం జరగడంతో స్థానికులు సాయంతో మాచవరంరోడ్డు వైపు వెళుతున్న ఆ వ్యక్తిని పట్టుకొని ప్రశ్నించారు. అయితే వారి నుంచి తప్పించుకోని పారిపోతుండగా వెంబడి పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ఒంగోలు మెట్రో: ప్రకాశం జిల్లా రచయితల సంఘ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది భీమనాథం హనుమారెడ్డి వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. స్థానిక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాసులు, కవి డాక్టర్‌ నాగభైరవ కోటేశ్వరరావు, సంఘ ప్రధాన కార్యదర్శి యత్తపు కొండారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement