జాళ్లపాలెం విద్యార్థిని పుస్తకానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

జాళ్లపాలెం విద్యార్థిని పుస్తకానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు

Jan 20 2026 7:32 AM | Updated on Jan 20 2026 7:32 AM

జాళ్ల

జాళ్లపాలెం విద్యార్థిని పుస్తకానికి రాష్ట్ర స్థాయి గుర్

జాళ్లపాలెం విద్యార్థిని పుస్తకానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించండి ● సమీక్షలో జేసీ శ్రీనివాసులు

కొండపి: మండలంలోని పెద్ద కండ్లకుంట పంచాయతీ జాళ్లపాలెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ యూపీ పాఠశాలలోని విద్యార్థిని రాసిన పుస్తకానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంచికంటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పెద్ద కండ్లగుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న చింతగుంట్ల గీతిక ఎనిమిదో తరగతిలో రాసిన కథలు, కవితలు ‘వేదన’ సంకలనంగా ‘మరో గ్రంథాలయ ఉద్యమం’ పక్షాన ప్రచురించారన్నారు. విద్యార్థుల రచన విభాగంలో పాఠశాల గ్రంథాలయాలకు ఈమె రాసిన పుస్తకం ఎంపిక చేశారని రాష్ట్ర విద్యాశాఖ తెలియజేసిందని చెప్పారు. ఈ సందర్భంగా జాళ్లపాలెం, పెద్ద కండ్లగుంటకు చెందిన ఉపాధ్యాయులు గీతికకు అభినందనలు తెలిపారు. గీతిక మాట్లాడుతూ మంచికంటి మాస్టారు ఇచ్చిన పుస్తకాలను చదివిన తర్వాత తనకు కథలు రాయాలని కుతూహలం కలిగిందని, చుట్టూ జరిగే విషయాలతో తాను రాసిన కథలు, కవితలను మాస్టారుకు వివరించగా ఆయన మెచ్చుకొని వాటిని సరిదిద్ది వాటికి బొమ్మలు వేయించి పుస్తకంగా ప్రచురించి ఇంత గుర్తింపు రావడానికి కారణమయ్యారని తెలిపారు.

మార్కాపురం టౌన్‌: రిపబ్లిక్‌ డే వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ పీ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్య్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని, అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడం, ప్రోటోకాల్‌ విషయంలో లోపం లేకుండా చూసుకోవాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్‌, శకటాలను ఏర్పాటు చేయాలని, సంబంధిత శాఖాధికారులకు దిశానిర్దేశం చేశారు. 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు సబ్‌కలెక్టర్‌ నివాసంలో ఎట్‌హోమ్‌ కార్యక్రమం ఉంటుందన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ ఓబులేసు, ఇన్‌చార్జి సబ్‌కలెక్టరు శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు పాల్గొన్నారు.

జాళ్లపాలెం విద్యార్థిని పుస్తకానికి రాష్ట్ర స్థాయి గుర్1
1/1

జాళ్లపాలెం విద్యార్థిని పుస్తకానికి రాష్ట్ర స్థాయి గుర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement